మనం ఉదయం లేచిన దగ్గర నుండి లక్ష్మిదేవి ని సంపద కోసం పూజిస్తూ ఉంటాం, కానీ మన కళ్ళ ముందు
నడయాడే మన ఇంటి లక్ష్మి ని చూడలేకపోతున్నాం.
అష్ట లక్ష్మి అని పూజిస్తాం.
గృహలక్ష్మి-ఇంటిని శుభ్రంగా,అందం గా చక్కదిద్దే స్త్రీ,
సంతానలక్ష్మి-పిల్లపాపలతో అలరారుతు ఉండే పొలతి,
ఆదిలక్ష్మి- మెడలో మాంగల్యం తో పచ్చగా కాపురాన్ని తీర్చిదిద్దే వనిత,
ధైర్యలక్ష్మి-అన్నదమ్ముల ధైర్యానికి ఆసరాగ వెన్నుతట్టి నిలిచే ఇంతి,
విజయలక్ష్మి-మెట్టినింట అడుగిడి పుట్టింటి పేరు కి మచ్చ రానీయకుండా ఇంటిని కాపాడే శక్తి,
ధనలక్ష్మి-పెళ్లి లో పచ్చటి తలంబ్రాలు,వరుడి మీద కుమ్మరిస్తూ అలాంటి సిరి సంపదలు నీ ఇంట కురిపిస్తాను అని మాట ఇచ్చిన లక్ష్మి,
గజలక్ష్మి-క్లిష్ట సమయంలో భర్త వెన్నుతట్టి,కార్యం లో మంత్రిగా వ్యవహరించే వెలది,
విద్యాలక్ష్మి-పిల్లలకి మంచి చెడులని, విద్యాబుద్దులని నేర్పే పరిపూర్ణ మగువ అమ్మ....
ఇలాంటి స్త్రీ జాతిని గౌరవించడం మన కర్తవ్యం.....
superbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbbb raaaaaaaaaaaaaa
ReplyDelete